కంటి వెలుగు అద్భుతమైన పథకం అన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో కంటి వెలుగు పథకంలో భాగంగా మంజూరైన అద్దాలను ఆరోగ్య లబ్దిదారులకు గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలోలేని పథకాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. కంటి వెలుగు పేదలకు గొప్పవరమన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన అద్దాలను కూడా ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.
Also Read:ఉదయం పూట తప్పక వేయాల్సిన ఆసనాలు!
కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొనియాడరని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తుచేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు.రైతులకు రైతు బంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని చెప్పారు.
Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే