మోదీ పాఠశాల కోసం సీరత్ నాజ్ అనే చిన్నారి భారత ప్రధాని మోదీకి అభ్యర్థన పెట్టిన సంగతి తెలిసిందే. సీరత్ గత వారం మోదీకి తన పాఠశాలను చూపిస్తూ ఒక వీడియో తీసింది. అందులో మీరు అందరి మాటలు వింటారు కదా..నా మాట కూడా వినండి అంటూ చేసిన ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీరత్ చేసిన ఆ వీడియోతో జమ్ము పాఠశాల విభాగం కదిలివచ్చింది. ఏకంగా జమ్ము పాఠశాలల విభాగం డైరెక్టర్ రవిశంకర్ శర్మ స్వయంగా పర్యవేక్షించారు. దీంతో ఆ బాలిక చదువుతున్న పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారు.
Also read: Bharat:హ్యాపియేస్ట్ స్టేట్ ఎదంటే…!
రవిశంకర్ శర్మ మాట్లాడుతూ…ఆధునిక సౌకర్యాలతో పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. కానీ అనుమతుల విషయంలో జాప్యం జరగడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. అయితే వాటిని ఒక్కొటిగా పరిష్కరిస్తున్నామని త్వరలోనే పనులు జరుగుతాయని తెలిపారు. వచ్చే మూడు నాలుగేళ్లలో జమ్ము ప్రాంతంలో అన్ని జిల్లాలో కలిపి 1000కిండర్ గార్డెన్‌లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
Also read: Rahul Gandhi:షాకిచ్చిన న్యాయస్థానం
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా లొహై మల్హార్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. అయితే ఆ స్కూళ్ళో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సీరత్ ఆ విషయాన్ని ప్రధాని మోదీకి ఒక వీడియో ద్వారా తీసుకెళ్లాలనుకుంది. దాదాపు 5నిమిషాలు నిడివి గల ఈ వీడియోలో తన పాఠశాలను మొత్తం చూపిస్తూ వివరించింది. పాఠశాలను కట్టించండని…మాకు సాయం చేయండని చిన్నారి సీరత్ తన వీడియోలో ప్రధానిని కోరింది.