ఎన్టీఆర్ తో అందుకే ఒప్పుకున్నాడు

34
- Advertisement -

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాలతో సినిమా చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్రను ఫైనల్ చేశారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఫైనల్ అయ్యాడు. అధికార అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. గతంలో మేము చెప్పిన విధంగానే సైఫ్ అలీఖాన్ ఈ సినిమా చేస్తున్నాడు. కొరటాల శివకి మంచి దర్శకుడిగా గొప్ప పేరు ఉంది. అయితే, అంతకు మించి మంచి కథా రచయితగా కొరటాల శివకి లాంగ్ జర్నీ ఉంది. ముఖ్యంగా ఆయన రాసే బలమైన పాత్రలకు, భావోద్వేగ సన్నివేశాలకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ను కొరటాల అద్భుతంగా డిజైన్ చేశాడట. అందుకే సైఫ్ ఒప్పుకున్నాడు. తన పాత్ర సైఫ్ అలీ ఖాన్ కి చాలా బాగా నచ్చిందట.

Also Read:‘హను-మాన్‌’ షూటింగ్ పూర్తి

నేడు సైఫ్ అలీఖాన్ షూట్ లో కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పోర్టు సెట్‌ను కూడా సిద్ధం చేశారు. కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి కొరటాల అద్భతంగా కథను రాశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వజ్రాల దొంగ అని.. అలాగే సముద్రంలో సైనికుల్ని కాపాడే రక్షకుడిగానూ కనిపిస్తాడని.. ఒక దొంగ దేశం కోసం పోరాడే వీరుడిగా ఎలా మారాడు అనేది ఎన్టీఆర్ పాత్ర అని టాక్ నడుస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ పాత్ర కూడా వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందట.

Also Read:చెట్లే ఆమె పిల్లలు..తిమ్మక్క నీకు సలాం

ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ను అందుకుంటుందో చూడాలి.

- Advertisement -