బన్నీ పోస్ట్ పై నాని ఫ్యాన్స్ ఫైర్

38
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ద‌స‌రా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌ బ‌స్ట‌ర్ అయ్యింది. పైగా నాని కెరీర్‌ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ గా నిలిచింది. ముఖ్యంగా నాని సహజ నటనను అందరూ ఫిదా అయ్యారు. కొందరు సినీ ప్రముఖులు కూడా నాని నటనను పొగుడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆ లిస్ట్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు. దసరా టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ బన్నీ… నాని అత్యుత్తమ నటన కనబర్చారు అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

నానితో పాటు కీర్తి సురేష్, ఇతరుల నటీనటుల నటన కూడా చాలా బాగుంది అని బన్నీ పేర్కొన్నారు. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉందని, సత్యన్ అద్భుతమైన కెమెరా పనితనాన్ని కనబర్చారు అని బన్నీ చెప్పాడు. అంతేకాక కెప్టన్ ఆఫ్ ది షిప్ గా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డెబ్యూ డైరెక్టర్ గా తనను తాను అధిగమించాడు అని బన్నీ కామెంట్స్ చేశాడు.

నిర్మాతలకు కూడా బెస్ట్ విషెస్ తెలిపారు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే, ఈ అల్లు అర్జున్ పోస్ట్ పై కొందరు నాని ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యి.. థియేటర్స్ నుంచి వెళ్లిపోయాక ఇప్పుడు తీరిగ్గా సినిమా గురించి పాజిటివ్ గా కామెంట్ పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి ? అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -