డిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ నేడు సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా సీబీఐ నిన్న అరవింద్ కేజ్రివాల్ కు సమన్లు మరి చేసింది. ఇప్పటికే అప్ నేతలలో ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా తో పాటు మరికొదరు కూడా అరెస్ట్ కాగా.. ఇప్పుడు అరవింద్ కేజ్రివాల్ విచారణ ఎదుర్కోవడం ఆసక్తికరంగా మారింది. అయితే అరవింద్ కేజ్రివాల్ ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆప్ నేతలు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. కేజ్రివాల్ కూడా ఇదే మాట చెబుతున్నారు. డిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఏది లేదని దర్యాప్తు సంస్థలు కావాలనే ఆప్ నేతలను టార్గెట్ చేస్తున్నాయని, విచారణ పూర్తయిన తరువాత తనను అరెస్ట్ చేసిన ఆశ్చర్యం లేదని కేజ్రివాల్ నిన్న జరిగిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. .
అయితే ఒకవేళ కేజ్రివాల్ అరెస్ట్ అయితే ఈ అంశం డిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో ప్రత్యామ్నాయ పోటీ ఏర్పడింది. కాంగ్రెస్ తరువాత బీజేపీని ఎదుర్కొనే పార్టీగా ఆప్ బలం పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆప్ దూకుడుకు కళ్ళెం వేసేందుకే మోడి సర్కార్ లిక్కర్ స్కామ్ అంటూ కొత్త నినాదాన్ని ఎంచుకుని ఆప్ నేతలను ఇబ్బంది పెడుతోందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతలు చెబుతున్నాట్లుగా నిజానికి మద్యం ఎక్సయిజ్ పాలసీ పంజాబ్ లో గట్టిగానే అమలౌతోంది. అక్కడ ఈ పాలసీ ప్రభుత్వానికి 50 శాతం ఆధాయన్ని తెచ్చిపెడుతోందని కేజ్రివాల్ చెబుతున్నారు.
మరి అలాంటి పాలసీలో ఎలాంటి స్కామ్ లేకపోయిన కక్ష పూరితంగానే ఈ ఆరోపణలు చేస్తూ ఆప్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని మోడి సర్కార్ పై కేజ్రివాల్ మండి పడుతున్నారు. కాగా అందరూ కేజ్రివాల్ చెప్పినట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనను అరెస్ట్ చేస్తే..ఆప్ పై కొంత ప్రభావం చూపినప్పటికి సానుభూతి పెరిగే అవకాశం ఉందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే జాతీయ పార్టీగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. మోడి సర్కార్ వ్యవహరిస్తున్న కక్ష పూరిత రాజకీయానికి, నియంత పాలనకు ఇదే నిదర్శనం అంటూ కేజ్రివాల్ అరెస్ట్ ను సెంటిమెంట్ అస్త్రంగా వాడుకునే అవకాశం లేకపోలేదు. మరోవైపు కేజ్రివాల్ ను అరెస్ట్ చేస్తే కొంతలో కొంతైనా ఆప్ దూకుడు కు అడ్డుకట్ట వేయొచ్చనేది కేంద్రం ప్లాన్ మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..