Ram Charan:రాంచరణ్ కు శంకర్ ఎఫెక్ట్!

34
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ” గేమ్ ఛేంజర్ ” అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే సగభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అసలు శంకర్ మూవీ అంటే సంవత్సరాలకు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. అలాంటిది ఊహించని విధంగా శంకర్ రాంచరణ్ తో చేస్తున్న మూవీని స్పీడ్ గా కంప్లీట్ చేస్తుంటే అభిమానులు కలా లేక నిజమా అనుకున్నారంతా. కాని మళ్ళీ అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దీనికి కారణం ఆగిపోయిన ” భారతీయుడు 2 ” మూవీని మళ్ళీ పట్టాలెక్కించడమే. .

గతంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నిర్మాతలు ఈ మూవీ షూటింగ్ ని ఆపేశారు కాని కమల్ హాసన్ చొరవ తీసుకోవడంతో ఈ మూవీ మళ్ళీ ప్రారంభం అయింది. అంతే కాకుండా ఈ మూవీని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ గట్టి ప్రణాళికతో ఉన్నారు. దాంతో శంకర్ దృష్టి అంతా ఇప్పుడు భారతీయుడు 2 మూవీపైనే ఉంది. దీంతో రాంచరణ్ మూవీ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక చేసేదేమీ లేక చరణ్ ఫ్యామిలీతో విదేశాల ట్రిప్ లో ఉన్నాడు.

అయితే రాంచరణ్ శంకర్ మూవీ అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 పొంగల్ బరిలో దించాలని నిర్మాతా దిల్ రాజు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు బారతీయుడు 2 కారణంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక శంకర్ మూవీ తరువాత రాంచరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీకి కమిటైన సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా స్టార్ట్ అవ్వడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. మొత్తానికి భారతీయుడు 2 పూర్తి చేసే పనిలో శంకర్ ఉండడంతో.. అటు రాంచరణ్, ఇటు దిల్ రాజు ఇద్దరు కూడా ఎఫెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -