బీఆర్‌ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ధన్యావాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఈవోఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. కేసీఆర్ నిర్ణయంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కితీసుకున్నదని అన్నారు.
అయితే ఆర్‌ఐఎన్‌ఎల్‌ను బలోపేతం చేయాలని కేంద్రం ఆలోచించడానికి కారణమైందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలని లక్ష్మీనారాయణ సూచించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని కేంద్ర మంత్రి ప్రకటించారు.
శ్రీ కేసీఆర్ #KCR గారికి ధన్యవాదాలు, ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈఓఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు . ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని , RINLని బలోపేతం చేయలని ఆలోచించడానికి కారణం అయ్యింది . తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలి.
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 13, 2023
ఇవి కూడా చదవండి…
KTR:సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు
బీజేపీలోకి కాంగ్రెస్ మహేశ్వర్ రెడ్డి
సీఎం కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది :తోట