OTT:డైరెక్ట్‌గా ఓటీటీలోకి!

74
- Advertisement -

థియేటర్లకు ధీటుగా పోటీపడుతున్నాయి ఓటీటీ సినిమాలు. థియేటర్ల కంటే ఓటీటీల్లో సినిమాలు ఎప్పుడు వస్తాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి.

నటుడు, నిర్మాత, దర్శకుడు రవిబాబు నిర్మించిన అసలు ఓటీటీలో రిలీజ్ కానుంది. వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ రవిబాబు థ్రిల్లర్స్‌ని రూపొందించడంలో దిట్ట. ఈటీవీ విన్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో ఉదయ్ బండారి, సురేష్ కంభంపాటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

అలాగే ఓ కల చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా దీపక్ కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మించారు. సోషియో లవ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో దీపక్ కొలిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -