సుక్కు స్ట్రాటజీ.. అదుర్స్ !

88
sukumar
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ” పుష్ప ది రూల్ ( పార్ట్ 2 ) “. పుష్ప పార్ట్ 1 మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ వీడియోను అలాగే, ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ గ్లింప్స్ గాని, గంగమ్మ తల్లి గెటప్ లో ఉన్న బన్నీ పోస్టర్ గాని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సాధారణంగా హీరో బర్త్ డే కానుకగా టిజర్ లేదా పోస్టర్స్ రిలీజ్ చేయడం సర్వసాధారణం. కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఇందుకు భిన్నంగా ట్రై చేశారు. .

గ్లింప్స్ పేరుతో ఏకంగా మూడు నిముషాల నిడివి ఉండే వీడియోను రిలీజ్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. అది కూడా మతిపోగొట్టే మాస్ అంశాలతో కాకుండా.. సింపుల్ గా ” వేర్ ఈజ్ పుష్ప ” అనే పాయింట్ తో కేవలం ఆడియన్స్ క్యూరియాసిటీ రెట్టింపు చేసే విధంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. ఆ తరువాత అమ్మవారి గెటప్ లో ఉన్న పుష్పరాజ్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల మతులు పోగొట్టాడు. దీంతో పుష్ప పై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. అయితే ఇదంతా సుక్కు క్రియేటివ్ స్ట్రాటజీ అని అంటున్నారు విశ్లేషకులు. మొదటి భాగం విజయం సాధిస్తే రెండవ భాగంపై అంచనాలు పెరగడం ఖాయం. అలాగే మొదటి భాగాన్ని మించి హీరోయిజాన్ని కోరుకుంటారు ఆడియన్స్.

కాబట్టి వారి అంచనాలను అందుకోవడం దర్శకులకు కత్తిమీదసామే. అయితే సుకుమార్ మాత్రం వారి అంచనాలకు భిన్నంగా రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప వీడియో చివర్లో సింపుల్ గా హీరోయిజాన్ని ఫిక్స్ తీసుకెల్లే విధంగా ” అడవిలో జంతువులు ఒకడుగు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. ఆదే పులి రెండడుగులు వెనక్కి వేసిందటే పుష్ప వచ్చాడని అర్థం ” అనే డైలాగ్ ఉంచి మాస్ హీరోయిజాన్ని రెట్టింపుగా ఎలివేట్ చేశారు సుక్కు. ఇలా ఒక్క ఫైట్ సీన్ లేకుండా ఎలివేట్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ లో కూడా ఫాలో అయ్యారు డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు అదే స్ట్రాటజీని తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఫాలో అయినట్లు కనిపిస్తోంది. మరి గ్లింప్స్ తోనే అంచనాలు పెంచేసిన సుక్కు.. టిజర్, ట్రైలర్స్ తో సంచలనలు క్రియేట్ చేయడం ఖాయమని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -