ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. 2014లో జరిగిన పరిణామాల తరువాత ఆయన రాజకీయాలకు కొంత దూరం పాటించారు. ఆ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరినప్పటికి గతంలో మాదిరి యాక్టివ్ గా లేరు. కాగా గత కొన్నాళ్లుగా ఆయనతో ఏపీ బీజేపీ నేతలు టచ్ లో ఉంటూ వచ్చారు. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరతారనే వార్తలు ఊపందుకున్నాయి. ఎట్టకేలకు ఆయన నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ తో ఏపీ బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. .
ఎందుకంటే ఏపీ బీజేపీలో బలమైన నేతల కొరత మెండుగానే ఉంది. ఎలాగైనా ఏపీలో బలపడాలని చూస్తున్న బిజేపి.. ప్రస్తుతం ఇతర పార్టీలపైనా ఆధార పడవలసి వస్తోంది. ముఖ్యంగా జనసేన అండ పైనే బిజేపి అధిక భారం వేసింది. కానీ జనసేన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి.. దాంతో సొంత బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న బిజేపి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఆశజ్యోతి అనే చెప్పాలి. బలమైన వక్ధాటి తో విమర్శలు గుప్పించడంలోనూ నేతలను ఆకర్షించడంలోనూ కిరణ్ కుమార్ రెడ్డి శైలి ప్రత్యేకం. 2014 ఎన్నికల టైమ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ఎంత క్రియాశీలకంగా వ్యవహరించారో అందరం చూశాం.
ఇవి కూడా చదవండి…