కరోనా కట్టడిలో కేంద్రం మరోసారి ప్రజలను మోసం చేయనుంది. రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేయలేమని చేతులెత్తేసింది. ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి రాష్ట్రాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేయనుంది. ఇందులో భాగంగా కేంద్రం ఇక నుంచి వ్యాక్సిన్‌లు సరఫరా చేయకూడదని నిర్ణయించకున్నట్టు సమాచారం.
కరోనా విజృంభిస్తున్న సమయంలో కేంద్రం ఇలా ప్రవర్తించడం పట్ల పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పలు రాష్ట్రాలు తమకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరగా…సరఫరా చేసేది లేదని సొంతంగా కొనుగోలు చేసుకోవాలని సూచించింది. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్, అప్రాప్రియేట్ బిహేవియర్ వంటి 5అంచెల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణలో కరోనా కట్టడికి పక్కగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ప్రీకార్షనరీ డోసులు ఇవ్వడంతో దేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలిచిందని గుర్తు చేశారు. అయితే ఇంకా తెలంగాణకు 15లక్షల డోసుల పంపిణీ చేయాలని గతంలో పలుమార్లు కోరినట్టు ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రికి గుర్తు చేశారు. రాష్ట్రానికి అవసరమయ్యే డోసులును పంపిణీ చేయాలని కోరారు.
అయితే దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కావాల్సిన వ్యాక్సిన్లు మార్కెట్లో పుష్కలంగా లభిస్తున్నాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేయాలని సూచించారని తెలిపారు. అయితే ఇందులో గతంలో తెలంగాణకు రావాల్సిన డోసులను పంపిణీ చేయాలని సూచించిన ఫలితం లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ సంస్థ బయోలాజికల్ ఈ సహకారంతో 15లక్షల డోసులు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన బయోలాజికల్ ఈ ఎండీ మహిమాకు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడ చదవండి…