హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్ 2023లో నేడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్ లో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను మట్టికరిపించి ఫుల్ జోష్ లో ఉన్న కోహ్లీ సేన రెండవ విజయం కోసం తహతహలాడుతోంది. మరోవైపు వరునుడి దెబ్బతో పంజాబ్ చేతిలో ఓడిపోయిన కోల్ కతా.. ఈ మ్యాచ్ తోనైనా విజయం సాధించి బోణి కొట్టాలని చూస్తోంది.
దీంతో ఈ రెండు జట్ల మద్య మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 30 సార్లు తలపడగా అందులో కోల్ కతా 16 సార్లు ఆర్సీబీపై పైచేయి సాధించగా.. 14 సార్లు ఆర్సీబీ విజయాలను నమోదు చేసింది. ఇక రెండు జట్లు కూడా ప్లేయర్స్ విషయంలో పటిష్టంగానే ఉన్నాయి. ఆర్సీబీ ఓపెనర్స్ గా కోహ్లీ, డూప్లిసిస్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.. ఇక మిడిలార్డర్ లో దినేష్ కార్తిక్, మాక్స్ వెల్, ప్రభుదేశాయి వంటి వాళ్ళు బెంగళూరు కు అదనపు బలం.. బౌలర్స్ విషయానికొస్తే.. మహ్మద్ సిరాజ్, హిమన్సు శర్మ వంటి వాళ్ళు చెలరేగితే ఆర్సీబీకి తిరుగుండదు.
మరోవైపు ఆర్సీబీ తో పోల్చితే కేకేఆర్ కాస్త బలంగానే ఉంది. మ్యాచ్ ను ఏ క్షణంలోనైనా మలుపు తిప్పగలిగే.. ఆండ్రూ రసెల్, జాన్సన్ రాయ్, నితీశ్ రాణా, లిట్టన్ దాస్ వంటి హార్డ్ హిట్టర్స్ కేకేఆర్ సొంతం. బౌలర్స్ లో కూడా హర్షిత్ రాణా, ఉమేశ్ యాదవ్ వంటి వాళ్ళు ఉన్నారు. ఇదిలా ఉంచితే ఈ మ్యాచ్ ఆర్సీబీకి కాస్త భయాన్ని కలిగించేదే అని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ లో జరుగుతుండగా.. ఈ స్టేడియంలో ఆర్సీబీకి అత్యంత చెత్త రికార్డ్ ఉంది. 2017 లో ఇదే స్టేడియంలో కోల్ కతా చేతిలో ఆర్సీబీ కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయి ఘోరమైన ఓటమిని చవి చూసింది. అయితే ఆ తరువాత ఇరు జట్లలో కూడా ఎన్నో మార్పులు జరిగాయనుకోండి. అయినప్పటికి ఈ చేదు జ్ఞాపకం ఆర్సీబీ అభిమానులను కలవరపెడుతోంది. మరి ఆర్సీబీ కేకేఆర్ జట్ల మద్య నేడు జరిగే పోరులో ఏ జట్టు పై చేయి సాధిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..