యేడాదంతా కష్టపడి ఎండకాలం రాగానే ఎక్కడికైనా రెక్కలు తొడుక్కొని ఎగిరిపోదామని అనుకుంటున్నారా …మన బడ్జెట్‌లో మన దేశంలో తిరిగి ఎంజాయ్ చేద్దామని అనుకోవడం సహజమే. అయితే పరీక్షల భయం నుంచి కొలుకోవడానికి ఎండల నుంచి రక్షణ పొందడానికి హాలీడేస్‌ను ఎంజాయ్ చేయాలంటే భారతదేశంలో వివిధ రకాల హాలీడే స్పాట్ బోలెడన్ని ఉన్నాయి. వాటిలో గోవా ఊటీ లద్ధాఖ్ షిమ్లా డార్జిలింగ్ లాంటి ప్రదేశాల్లే గాకుండా మరెన్నో పర్యటక స్థలాలు ఉన్నాయి. వాటిలో టాప్ టెన్ ఎంచుకోవడం చాలా కష్టమే కానీ ఈ టాప్ టెన్ చూసేయండి..!
షిమ్లా..భారతదేశంలో అత్యంత సుందరమైన టూరిస్టు స్థలం ఎదైనా ఉందంటే అది షిమ్లా చూట్టు శివాలిక్ మధ్యహిమాలయాల మధ్య ఉన్న షిమ్లా టూరిస్ట్ లకు డెస్టినేషన్ ప్లేస్. ఇక్కడికి ప్రతిసంవత్సరం లక్షల్లో జనాలు సమ్మర్ హిట్ నుంచి తప్పించుకోవడానికి వస్తుంటారు.
లద్ధాఖ్..జమ్మూకశ్మీర్ కు కేటాయించిన ప్రత్యేక స్వయంప్రతిపత్తిని ఎత్తివేసిన తర్వాత లద్ధాఖ్ జమ్ముకశ్మీర్‌కు పర్యాటకులు కశ్మీర్ అందాలని చూడ్డానికి ఎగబడుతున్నారు. అంతేకాదు అత్యంత ఎత్తైన ప్రదేశంలో లద్ధాఖ్ మంచి టూరిస్ట్ ప్లేస్‌గా టాప్ లో నిలిచింది. ఇక్కడ సమ్మర్ 20°C నమోదవుతుంది. కాబట్టి మీకు డ్రీమ్ కమ్ ట్రూ అనే డెస్టనీగా మారుతుంది.
డార్జిలింగ్…కాఫీ తోటల పంటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ ప్రాంతం సమ్మర్ నుంచి తప్పించుకొని ఇక్కడ ప్రత్యక్షమయ్యే టూరిస్ట్ డెస్టనీ.ఇక్కడ సమ్మర్లో 15°C to 20°C ఉష్ణోగ్రత నమోదవుతూ మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందిక్కడ.
మౌంట్ ఆబూ..రాజస్థాన్ ఎడారులు ఒంటెలు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన ప్రాంతం మౌంట్ ఆబూ. ఇక్కడ అన్ని కాలాల్లో కూడా మంచి వాతావరణం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా దిల్వారా టెంపుల్ కలదు. ఇది ముఖ్యంగా జైనులకు ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా నిలిచింది. 20°C to 30°C ఉష్ణోగ్రతలు ఉండి రాజస్థాన్ కోటలను కూడా చూడవచ్చు.
మూనార్..దేవతల స్వర్గమైన కేరళలలో ఉన్న మూనార్ ప్రాంతం. లష్ గ్రీన్ టీ ప్రసిద్ధి పొందింది. మంచి సీఫుడ్ ఎంజాయ్ చేస్తూ కొబ్బరి తోటల్లో తిరుగుతూ ఉంటే..వచ్చే సంతోషం మరెక్కడా దొరకదు.
కూర్గ్..స్కాట్‌లాండ్ ఆఫ్ ఇండియాగా పిలిచే కూర్గ్ ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక్కడ కాఫీ తోటలు ప్రత్యేకమైన పశ్చిమకనుమల్లో ఉండే కూర్గ్ సమ్మర్ నుంచి హాయిగా విహరించే యాత్రా స్థలంగా చెప్పవచ్చు.
ఊటీ..దక్షిణ కశ్మీర్‌గా పిలిచే ఊటీ లేద ఉదకమండలం. ఇది తమిళనాడులోని తూర్పుకనుమలు పశ్చిమకనుమల మధ్య ఉన్న అందమైన టూరిస్టు డెస్టనీ. ఇక్కడ 15°C to 20°C మంచి వాతావరణంలో ఎండకాలంలో ఇక్కడ సేద తీరవచ్చు.
మహబలేశ్వర్..పశ్చిమ కనుమల్లో ఉండే మహబలేశ్వర్ ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. ఇక్కడి వాతావరణం 20°C to 25°C ఇక్కడికి జంప్ కావచ్చు. గోదావరి నది పుట్టిన స్థలం కూడా ఉంటుంది. నిరంతరం శైవనామస్మరణతో ఉండే మహబలేశ్వర్ ప్రాంతం…అజంతా గుహలు చాలా దగ్గరగా ఉంటాయి. మీరు వెళ్లే టూరిస్ట్ స్పాట్‌లో ఇది ఉంటే ముందుగా ఇక్కడికి వెళ్లవచ్చు.
నైనిటాల్…ఉత్తరాఖండ్ రాష్ట్రంలో షిమ్లా దగ్గర ఉండే ప్రాంతం నైనిటాల్. శివాలిక్ మధ్య హిమాలయాల మద్య పర్వతాల మధ్య ఉండే నైనిటాల్ ఆపిల్ తోటలకు ప్రసిద్ది. ఇక్కడి వాతావరణం 15°C to 20°C మంచి వాతావరణంలో ఎండకాలంలో ఇక్కడ సేద తీరవచ్చు.
మనాలీ..హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న మనాలీ ఒక అందమైన ప్రదేశం. ఎండకాలం నుంచి తప్పించుకోని ఇక్కడికి వస్తే 10°C to 25°C ఎంజాయ్ చేయవచ్చు. అలాగే అనేక రకాలైన స్నో గేమ్స్ కూడా ఉంటాయి. మనాలీ కి దగ్గరలోనే కులు కూడా ఉంటుంది. చుట్టు మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య స్నో గేమ్స్ ఆడటం గొప్ప అనుభూతిగా చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి…