KTR:సమర్థమైన నాయకత్వంతోనే పల్లె అభివృద్ధి..!

51
- Advertisement -

తెలంగాణలోని ప్రతి గ్రామం నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో ఉత్తమ గ్రామ పంచాయితీలకు అవార్డులను ప్రకటించిన సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి సాధ్యం కాదన్నారు.

ఇంకా…గ్రామీణ నేపథ్యం గురించి తనకు చాలా తక్కువ తెలుసు. పల్లెలకు ఏం కావాలి. పల్లెల్లో ఏ అవసరాలుఉన్నాయో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు అని అన్నారు. సర్పంచ్‌ కంటే ఎక్కువగా మన సీఎం కేసీఆర్ ఆలోచిస్తారు. అందుకే గ్రామీణ ప్రాంతాలకు ఏం కావాలో బాగా తెలుసన్నారు.

మ‌న దేశంలో ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ ఐదు అంచెలుగా ఉందన్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయ‌క‌పోతే అభివృద్ధి జ‌ర‌గ‌దు. ఎంపీటీసీలు గ్రామాల‌కు మండ‌లానికి మ‌ధ్య సమ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉండాలి. జ‌డ్పీటీసీలు మండ‌లానికి, జిల్లా ప‌రిష‌త్‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉండాలి. ఐదంచెల వ్య‌వ‌స్థ‌లో ఎవ‌రి పాత్ర ఏంట‌ని తెలుసుకోనంత కాలం.. ప్ర‌జాప్ర‌తినిధులైనా, వ్య‌వ‌స్థ అయినా ఎక్క‌డ వేసినా గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా ఉంటుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

ఎన్నిక‌ల్లో గెల‌వాల‌నే ఆరాటంతో అనేక హామీలు ఇస్తాం. ఆ హామీల‌ను నెర‌వేర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ పోస్టు ఖాళీ అయితే త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేశామని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ గ్రామీణం అభివృద్ధి జరగదని అందుకే 10జిల్లాలను 33జిల్లాలుగా మార్చి పల్లెలను అభివృద్ధి దిశవైపుకు పరుగులు తీస్తున్నామన్నారు.

142 మున్సిపాలిటీలు ఉన్నాయి. 12,769 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయి. దీంతో సూక్ష్మంగా ప‌ని చేసేందుకు వీలు క‌లిగింది. వికేంద్రీక‌ర‌ణ వ‌ల్ల వేగంగా ప‌నులు జ‌రుగుతాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 79 జాతీయ అవార్డులు గెలుచుకున్నాం. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఇవి కూడా చదవండి…

వైభవంగా శ్రీరామపట్టాభిషేకం..

Dharmapuri Arvind:ఎంపీపై పసుపు రైతుల కన్నెర్ర

ktr:చేసింది గోరంత..చేయాల్సింది కొండంత:కేటీఆర్‌

- Advertisement -