World Bank:అధ్యక్షుడిగా అజయ్ బంగా

61
- Advertisement -

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్ పదవీకాలం ఇంకా సంవత్సరం ఉండగానే ముందస్తుగా మాల్సాస్ పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్… అజయ్ బంగాను ప్రపంచ బ్యాక్ అధ్యక్ష పదవికి ప్రతిపాదించారు. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది.

అజయ్ బంగా తన నామినేషన్ కు మద్దతుకోసం గత నెలలో ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించారు. ఈ క్రమంలో భారతదేశంలోనూ పర్యటించారు. ఈ పదవికోసం నామినేట్ అయిన తొలి భారత సంతతి వ్యక్తి అంజయ్ బంగా కావడం గమనార్హం.

1959 నవంబర్ 10న పుణెలో జన్మించారు అజయ్‌. బంగా బాల్య జీవితం భారతదేశంలోనే గడిచింది. ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశారు. అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2016లో పద్మశ్రీ అవార్డుతో అజయ్ బంగాను భారత ప్రభుత్వం గౌరవించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -