- Advertisement -
కర్ణాటక ఎన్నికలు ప్రకటించిన సందర్బంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక విషయాలను తెలిపింది. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..వయనాడ్ నియోజకవర్గంకు తొందరేమి లేదని ప్రకటించారు. 1951ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ నియోజకవర్గం ఖాళీ ఏర్పడుతుందో ఆ స్థానాన్ని ఆరు నెలల లోపు పూర్తిచేయాలని సూచించింది. కావున ఏటువంటి తొందర లేదన్నారు. మేము ఫిబ్రవరి వరకు నోటిఫై అయిన స్థానాలకు మాత్రమే షెడ్యూల్ ప్రకటిస్తున్నామని తెలిపారు. అయితే సురత్ కోర్టు పై కోర్టుకు వెళ్లేందుకు ఒక నెల గడువు ఇచ్చినందున ఇప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని రాజీవ్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో సురత్ కోర్టు 2యేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడాచదవండి…
Karnataka Polls: మే10న ఎన్నికలు
Karnataka Assembly: ఓటు ఫర్ హోమ్
Netherlands:550మందికి తండ్రైన ఓ ప్రబుద్ధుడు?
- Advertisement -