భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగాన్ని విజయంతంగా చేపట్టింది. ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
రుపతి జిల్లా షార్ లోని రెండో ల్యాంచ్‌పాడ్ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఎల్వీఎం-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాలపాటు ప్రయాణించి భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు. మార్క్-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో ముందంజలో ఉందని చెప్పారు. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఈ రాకెట్ పొడవు 43.5 మీటర్లు, వెడల్పు 4.4 మీటర్లు, బరువు 543 టన్నులు. ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి వన్‌వెబ్ సంస్థతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 72 ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలి. మొదటి దశలో 36 ఉపగ్రహాల్ని గత అక్టోబర్ 23న ప్రయోగించారు. ఆదివారం మరో 36 ఉపగ్రహాల్ని ప్రయోగించారు. ఇస్రో చేపట్టిన రెండో వాణిజ్య ఉపగ్రహ ప్రయోగమిది.
ఇవి కూడా చదవండి..