రాహుల్ 8 ఏళ్ళు దూరం.. ఇదంతా మోడీ వ్యూహమే!

23
- Advertisement -

నరేంద్రమోదీ అధీకారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలపై వ్యవహరిస్తున్న తీరు.. ఎంతటి ఆందోళనకరంగా ఉందో మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. నిత్యం ప్రతిపక్ష నేతలపై ఈడీ కేసులు. సీబీఐ దాడులు నిర్వహిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతూనే ఉంది మోడీ సర్కార్. బహుశా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలపై ఇంత కక్ష పూరితంగా వ్యవహరించి ఉండదేమో. ప్రభుత్వం చేస్తున్న తప్పులను, వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాలు ముఖ్యభూమిక పోషిస్తాయి. ప్రతిపక్షాలు లేకపోతే.. మంచి చెడులను బేరీజు వేసుకునే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మోడీ ప్రభుత్వం మాత్రం తాము చెప్పిందే శాసనం.. చేసేదే న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తుండడం చూస్తే నిజంగా ప్రజాస్వామ్యాన్ని కుని చేయడమేనని రాజకీయ అతివాదుల అభిప్రాయం. తాజాగా రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటు కూడా మోడీ నియంత పాలనకు అద్దం పడుతోంది.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడంపై దేశ వ్యాప్తంగా మోడీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఎంతో మంది నేతలు మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రతి చిన్న విషయానికి అనర్హత వేటు వేస్తే.. ఇప్పుడు అధికారంలో ఉన్న 99 శాతం మంది నేతలు వారి పదవులు కోల్పోతారని, ప్రజాస్వామ్య వ్యవస్థ క్షీణిస్తుందని లోక్ సత్తా పార్టీ నేత జేపీ వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ కూడా ఈ అంశం మీద మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటి రోజు అని, ప్రధాని మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి ఇదే నిదర్శనమని, దేశ చరిత్రలోనే ఇదొక చీకటి రోజని అభివర్ణించారు కే‌సి‌ఆర్. ఈ విధంగా అన్నీ వైపులా నుంచి మోడీ సర్కార్ నిర్ణయం పై విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమౌతున్నాయి.

ఇంతకీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడడానికి కారణం ఏమిటంటే.. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ఇంటిపేరును ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ.. ఆ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో నేరపూరిత నష్టదావా కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్ కు రెండేళ్ళు జైలు శిక్ష అమలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినా పార్లమెంట్ సమావేశంలో రాహుల్ ఎంపీ పదవికి అనర్హుడని, ప్రజాప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఆయన కు అనర్హత వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. దాంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం అధికారికంగా రద్దు అయింది. అంతే కాకుండా రాహుల్ మరో ఎనిమిదేళ్ళ పాటు ఎన్నికలకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే రాహుల్ జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్ ను చూస్తే మోడీ నియంతృత దోరణి స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాజకీయ నేతల మధ్య విమర్శలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యపై ఇన్ని రోజులు సైలెంట్ గా వ్యవహరించిన మోడీ సర్కార్ ఇప్పుడేందుకు బయటకు తీశారని, ఇదంతా కూడా మోడీ అమిత్ షా వ్యూహంలో భాగమే అనే గుసగుసలు నడుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి…

cmkcr:రాహుల్‌ అనర్హతను ఖండించిన సీఎం..

rahulgandhi:ఎంపీ రాహుల్‌పై అనర్హత..!

chandrababu:చంద్రబాబు వ్యూహమా.. జగన్ వైఫల్యమా?

- Advertisement -