పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే ఒకటి. వైజయంతీ మూవీ బేనర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమా మేకర్స్ ప్రకటించనట్టు సంక్రాంతి కి రావడం కష్టమే అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ , దీపికా పదుకునె నటిస్తున్నారు. ఇంకా భారీ తారాగణం ఉండనుంది. పాస్ట్ అండ్ ఫ్యూచర్ కథతో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా షూటింగ్ చాలా పెండింగ్ ఉందట. పైగా విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా టైమ్ పడుతుందని తెలుస్తుంది. షూటింగ్ పూర్తయినా వీఎఫ్ఎక్స్ టీం కొన్ని నెలలు తీసుకోవడం ఖాయం.
సొ ప్రాజెక్ట్ కే షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే సరికి సంక్రాంతి దాటేయడం పక్కా అనిపిస్తుంది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ ఈ సినిమాతో వరల్డ్ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేసి భారీ హిట్ కొట్టడం ఖాయమని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి…