వైరల్ అవుతున్న రాహుల్‌ కామెంట్‌..!

43
- Advertisement -

లండన్ వేదికగా భారత్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్‌…తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గురువారం రాహుల్‌ విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంగా తప్పుగా మాట్లాడారు. ఇప్పడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. దాంతో కేంద్రమంత్రులు బీజేపీ నేతలు రాహుల్‌పై విరుచుకుపడుతున్నారు.

పార్లమెంట్ వాయిదా అనంతంర విలేకరులతో మాట్లాడుతూ …దురదృష్టవశాత్తు నేను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నాను అని ఆయన అనడం కనిపిస్తోంది. వెంటనే ఆ మాటల వెనక ఉన్న తప్పిదాన్ని గుర్తించిన జైరాం రమేశ్ రాహుల్‌ వైపు తిరిగి వాటిని సరిచేశారు. దురదృష్టవశాత్తు నేను పార్లమెంట్ సభ్యుడినయ్యానని వారు జోక్‌ చేయగలరు అని మార్చి చెప్పమని సలహా ఇచ్చారు. దీంతో రాహుల్‌ స్పష్టతనిస్తూ మీ దురదృష్టం కొద్దీ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను అంటూ బీజేపీని ఉద్దేశించిన అన్నారు.

దీనిపై కేంద్రమంత్రులు స్పందించారు. పీయూష్‌గోయెల్‌ మాట్లాడుతూ…దీనిపై మాట్లాడటానికి మా దగ్గర పదాలు లేవు అని వ్యంగంగా స్పందించారు. మరొక కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిజంగా ఇది దురదృష్టమంటూ స్పందించారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి…

టీచర్ ఎమ్మెల్సీ..ఏవీఎన్ రెడ్డి విజయం

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్..

మోదీ దగ్గరకు చరణ్.. 23 నుంచి షూట్

- Advertisement -