నిలబడి నీళ్లు తాగుతున్నారా..అయితే?

42
- Advertisement -

సాధారణంగా నీళ్లు నిలబడి త్రాగుతాం కానీ అలా తాగడం చాలా ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. రోజుకి కనీసం 6-8 లీటర్ల నీరు తాగితే మంచిదని తెలుసుగానీ, నీళ్లను నిలబడి తాగకూడదని చాలా మందికి తెలియదు. ఇలా నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

నీళ్లు నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిలబడి త్రాగితే ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీని వలన అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. జీర్ణాశయం గోడలు దెబ్బతింటే.. ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

కాబట్టి నిలబడి నీళ్లు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కగా కూర్చొని నెమ్మదిగా సిప్ చేస్తూ. వేడి టీ త్రాగినట్లు త్రాగుతుంటే అసిడిటీ,అజీర్ణ సమస్యలు నెలలో ఏమందులు వాడకుండా తగ్గిపోతాయి. ఆహారంకు ముందు వెనుక గంట వరకు నీరు తాగకుండా చక్కగా నెమ్మదిగా మెత్తగా నమిలి తింటుంటే అజీర్ణము,గ్యాస్ సమస్య మందులు లేకుండాతగ్గుతాయి.

అంతేకాదు.. ప్రస్తునం బఫే సిస్టమ్ అంటూ కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. నిలబడి భోజనం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇది కూడా ఆరోగ్యానికి హాని కలిగించే అలవాటు అంటున్నారు వైద్య నిపుణులు. ఈ రెండింటినీ కూర్చుని మాత్రమే చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఐతే ఈ రోజుల్లో చాలామంది నిలబడే నీళ్లు, భోజనం లాగిచేస్తున్నారు. ఈ అలవాటుని మార్చుకుని ఈ రెండింటినీ కూర్చుని చేస్తే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -