లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ…తనకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను మాత్రమే ధరిస్తానని తెలిపింది. నేను ఎప్పుడు కాస్మోటిక్స్ ఉపయోగించను.అందుకే నా జట్టు నాకు చాలా ఇష్టంగా చూసుకుంటానని తెలిపింది. నా జట్టును ఎప్పుడూ సహజంగా ఉండేలా చూస్తాను. అందుకే ఉల్లిపాయ రసాన్ని వాడతాను అని తన బ్యూటీ సీక్రెట్ చెప్పింది. ఇక గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్టూ వదంతలు వినిపిస్తోంది. కానీ అవన్ని నిజమేనంటూ జాతీయ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అయితే దీన్నిపై తాజాగా ఈ భామ మీడియాకు ఘాటు స్పందించింది. మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించాం. అప్పటి నుంచి మా పై రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు అని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో కలిసి భోళాశంకర్‌లో నటిస్తుంది. అలాగే తమిళంలో కూడా తలైవాతో జైలర్‌లో కనువిందు చేయనుంది. అరణ్మయై4, బోలేచుడియన్, భంద్రా సినిమాల్లో కూడా సందడి చేయనుంది.
ఇవి కూడా చదవండి…