శాకుంతలం ప్రత్యేకమైనది…సమంత

26
- Advertisement -

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకొని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా చూశానని… గుణశేఖర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్టర్ ద్వారా పేర్కొంది. ఇంకా ఇప్పుడే సినిమా చూశాను. గుణశేఖర్‌ ఈ సినిమాను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఒక గొప్ప ఇతిహాసానికి మనోహరంగా జీవం పోశారు. ఇందులోని భావోద్వేగాలు అందరికీ నచ్చుతాయని తెలిపింది. చిన్నపిల్లలకు సైతం ఈ సినిమా ఎంతగానో నచ్చుతుందని..నా మనసులో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం శాకుంతలంకు ఉంటుందని పేర్కొంది. ఇంత మంచి సినిమాను ఆడియన్స్‌తో కలిసి చూడటం కోసం వెయిట్ చేస్తున్నాని…ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది.

శాకుంతలం సినిమాలో శకుంతల పాత్రకు సమంత, దుష్యుంతుడి పాత్రలో దేవ్ మోహన్‌ నటించారు. ఇంకా మోహన్ బాబు మధుబాల గౌతమి తదితర స్టార్స్‌ నటించారు. ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి…

కాబోయే పాన్ ఇండియా బ్యూటీ ఆమె!

ఓటీటీ : ఈ వీక్ కంటెంట్ ఇదే !

నిజంగా ఇది బాలయ్య గొప్పతనమే!

- Advertisement -