తెలంగాణలో పంచాయితీ రాజ్ శాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతి, పనితీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయిత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పంచాయతీ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పల్లెప్రగతి, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, గ్రామీణ సడక్ యోజన, స్వయం సహాయక బృందాల పనితీరు తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. దేశంలోనే అన్ని గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ…రాష్ట్రంలో పల్లె ప్రగతి, హరిత హారం లాంటి రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక కార్యక్రమాల వల్లనే వంద శాతం గ్రామాలు ఒడిఎప్‌గా మారాయని సీఎస్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు గణనీయంగా పెరగడంతోపాటు గ్రామ పంచాయతీల పాలన మెరుగుపడిందన్నారు. డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గడం, గ్రామ పారిశుధ్యం మెరుగుపడడంతో పాటు గ్రీన్ కవర్ గణనీయంగా పెరిగిందని శాంతి కుమారి పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం కింద 52.78లక్షల జాబ్ కార్డుల జారీ చేసినట్టు తెలిపారు. ఇదే పథకం కింద వైకుంఠధామములు డంపింగ్ యార్డులు నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు బృహత్ ప్రకృతి వనాలు రైతు వేదికలు డ్రైయింగ్ ప్లాట్ ఫారమ్‌లు సీసీ రోడ్లు మొదలైన వాటి నిర్మాణం చేసినట్టు సీఎస్ వెల్లడించారు. ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన్ కింద 200అమృత్ సరోవర్‌లను నిర్మించినట్టు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఫేజ్-11 కింద 42 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 11,60,920 వ్యక్తిగత సోక్ పిట్‌లు, 32,650 సామాజిక సోక్ పిట్‌లను నిర్మించినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి…