బన్నీ… 24గంటల తర్వాత !

27
- Advertisement -

స్టార్ హీరోలకు సంబంధించి ఏ చిన్న అంశమైనా సరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అందులోనూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఇక చెప్పేదేముంటుంది. నిన్న ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు ఆస్కార్ అవార్డు గెలిచాక తెలుగు నేలకు సంబంధించిన ప్రతి ఒక్కరు తమ సంతోషాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తూనే ఉన్నారు. కేవలం సినిమాలకే కాకుండా రాజకీయాలు క్రీడలు ఇలా అన్ని రంగాల వాళ్ళు వివిధ రూపాల్లో శుభాకాంక్షలు పర్వం కొనసాగించారు. అయితే ఎంత ఎదురు చూసినా బన్నీ వైపు ఎలాంటి విష్ రాకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచిన మాట వాస్తవం.

ఫైనల్ గా అల్లు అర్జున్ ఈవెంట్ జరిగిన ఇరవై ఏడు గంటల తర్వాత గ్రీటింగ్స్ చెప్పాడు. అది కూడా ఎలాంటి ఫోటో లేకుండా కేవలం పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళను ట్యాగ్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్ అంటూ సంబోధించి తెలుగుసీమకు గర్వకారణమని జూనియర్ ఎన్టీఆర్ ని ప్రస్తావించి అందరికీ హోల్ సేల్ గా కంగ్రాట్స్ చెప్పేశాడు. ఇదేదో నిన్నే చేయొచ్చుగా అనేది అభిమానుల ప్రశ్న. పుష్ప 2 ది రూల్ షూటింగ్ లో విపరీతమైన బిజీగా ఉండొచ్చు. కానీ వార్త అయితే తెలియకుండా ఉండే ఛాన్స్ ఖచ్చితంగా లేదు

ఎవరో ఎందుకు ముందు సుకుమారే చెప్పుంటాడు. అలాంటప్పుడు ఏ లంచ్ బ్రేక్ లోనో ఫ్రీ టైంలో ఇలా ట్వీట్ చేస్తే సరిపోయేది కానీ ఇంత టైం తీసుకోవడం వెనుక లాజిక్ బన్నీ ఒక్కడికే తెలుసు. వీటి సంగతి ఎలా ఉన్నా ఆర్ఆర్ఆర్ బృందానికి టాలీవుడ్ సెలబ్రిటీలు పోటీపడి సన్మాన కార్యక్రమాలు ఏర్పాలు చేయబోతున్నారు. ఇంకో పది ఇరవై రోజులు ఈ హడావిడి తప్పేలా లేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఏడాది కావొస్తున్నా ఇంకా ట్రిపులార్ కోసమే టైం కేటాయించాల్సి రావడం పట్ల వాళ్లెలా ఫీలవుతున్నారో కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది ఆపేసి కొత్త సినిమాల పనుల్లో పడమంటున్నారు.

ఇవి కూడా చదవండి…

నాని ‘దసరా’ హైలైట్స్ ఇవే!

బాలయ్య… కిడ్నాప్ సీన్

ముంబై బ్యాక్ డ్రాప్ తో పవన్ ?

- Advertisement -