నాని ‘దసరా’ హైలైట్స్ ఇవే!

20
- Advertisement -

నాని దసరా సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా సింగరేణి బొగ్గు ఏరియాలో జరిగే కథతో తెరకెక్కింది. ఈ నెల 30 న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి నాని గట్టి ప్రమోషన్స్ చేస్తున్నాడు. తొలి పాన్ ఇండియా రిలీజ్ కావడంతో ప్రమోషన్స్ పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాడు.

అయితే సినిమాలో ఫ్రెండ్షిప్ సీన్స్ , అలాగే లవ్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ లో కీర్తి నటన సినిమాకే హైలైట్ అంటున్నారు. అలాగే రియాలిస్టిక్ గా ఉండే యాక్షన్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. ఓవరాల్ గా నాని యాక్షన్ , కీర్తి లవ్ ట్రాక్ , యాక్షన్ దసరాకు మేజర్ హైలైట్స్ కాబోతున్నాయి.

శ్రీకాంత్ కొన్ని సన్నివేశాలను అద్బుతంగా డిజైన్ చేశాడని రిలీజ్ తర్వాత తన వర్క్ గురించి గొప్పగా మాట్లాడుకుంటారని నాని పదే పదే చెప్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన చెంకీల అంగీ సాంగ్ మంచి పాపులర్ నంబర్ గా దూసుకెళ్తోంది. వీ , టక్ జగదీష్, అంటే సుందరనికీ సినిమాలతో వరుస అవజయలు అందుకున్న నాని ఈ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇంకొద్ది రోజుల్లో దసరా రిజల్ట్ తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -