ఆస్కార్ గిఫ్ట్ బ్యాగ్ విలువెంతో తెలుసా?

55
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ అవార్డ్స్ వేడుక 2023 ఘనంగా ముగిసింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగగా తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు సాంగ్ అవార్డు గెలుచుకుంది. చంద్రబోస్, కీరవాణి కలిసి ఆస్కార్ అవార్డును అందుకున్నారు.

ఇక ఈ సారి ఆస్కార్‌లో గిఫ్ట్ బ్యాగ్‌ని అందించారు. ఈ గిఫ్ట్ విలువ ఎంతో తెలుసా. అక్షరాలా కోటి రూపాయలు. ఆస్కార్ అవార్డులకు షార్ట్ లిస్ట్ అయిన నామినీలకు ఎవ్రీ వన్ విన్స్ గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చారు.

రూ. కోటి విలువ చేసే ఈ బ్యాగ్‌లో కెనడియన్ ఎస్టేట్‌కు చెందిన $16 జంతికల ప్యాకెజీ అలాగే $40,000 వరకు విలువ చేసే దాదాపు 60 బహుమతులను కలిగి ఉంటుంది. ఇందులో ఇటాలియన్ లైట్ హౌస్‌లో స్టే చేయడానికి వీలు కల్పించే ఓచర్ కూడా ఉండనుంది.అలాగే ఆస్ట్రేలియాలో 1 చదరపు మీటర్ల స్థలం, కాస్మెటిక్ సర్జరీ వోచర్‌లు ఉన్నాయి.

ఆస్కార్ విజేతలు గోల్డెన్‌ ట్రోఫీ అందుకోవడమే జీవితంలో గొప్ప విషయం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన తర్వాత ప్రపంచ అత్యుత్తమ టెక్నీషియన్‌ లేదా నటుడు అనే పేరు దక్కుతుంది. ఆ కారణంగా కూడా వారి సినిమాలకు ప్రపంచం మొత్తం గుర్తింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -