డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ మూవీని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్‌బస్టర్ గా నిలిచాయి. గతంలో విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 1.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ రోజు కరీంనగర్లో జరిగిన గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్లో ‘దాస్ కా ధమ్కీ’ 2.0 ట్రైలర్ ను మంత్రి గంగుల కమలాకర్ లాంచ్ చేశారు.
అన్ని ఎలిమెంట్స్‌ని సమపాళ్లలో చూపించే పర్ఫెక్ట్ ట్రైలర్‌ను మేకర్స్ కట్ చేశారు. ట్రైలర్ కథాంశాన్ని తెలియజేస్తుంది. ఇది రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు భిన్నమైన వ్యక్తుల కథ. ఒకరు ధనవంతుడు, ఫార్మా కంపెనీకి సిఈవో. మరొకరు హోటల్ లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. ఫార్మా సిఈవో క్యాన్సర్ రోగులకు పూర్తిగా కోలుకోవడానికి సహాయపడే మందును కనుక్కుంటాడు. అతని లక్ష్యం క్యాన్సర్ రోగులు లేని ప్రపంచాన్ని చూడడమే. వెయిటర్ పేదవాడిగా చనిపోకూడదని అనుకుంటాడు. ఒక దురదృష్టకర సంఘటన ధనవంతుని మరణానికి దారి తీస్తుంది. అతని స్థానంలో వెయిటర్ ని తీసుకువస్తారు.
విశ్వక్ సేన్ ఫార్మా సీఈఓగా సూపర్ కూల్ గా కనిపించాడు. వెయిటర్ పాత్రలో మాస్ గా అలరించాడు. రెండూ అద్భుతంగా చేశాడు. నివేదా పేతురాజ్ విశ్వక్ ప్రేయసిగా అందంగా, కనిపించింది. వారి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే లవ్ ట్రాక్ లో మంచి హ్యుమర్ ఉంది.
విశ్వక్ సేన్ కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ నిలిచే స్క్రిప్ట్‌తో వచ్చారు. సబ్జెక్ట్‌ను అద్భుతంగా డీల్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ దినేష్ కె బాబు, సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ బెస్ట్ అవుట్‌పుట్ తీసుకురావడానికి కలిసి పనిచేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. ట్రైలర్ 2.0 అంచనాలని మరింత పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ…‘దాస్ కా ధమ్కీ’ 2.0 ట్రైలర్ లాంచ్ కి వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ కి, ఎమెల్యే రసమయి బాలకిషన్ కి కృతజ్ఞతలు. లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ కి మధ్య ఒక కేటగిరీ వుంటుంది. ఒక డ్రైవర్, డెలివరీ బాయ్, వెయిటర్.. వీళ్ళని ఏ మాత్రం అలోచించకుండా ఒక మాట అనేస్తాం. అదే లోయర్ మిడిల్ క్లాస్ వోడు తిరిగి దేబ్బెస్తే ఎలా వుంటుందో సినిమాగా తీశాం. అదే ధమ్కీ. సినిమా ఉగాది రోజు విడుదలౌతుంది. ఉగాది పచ్చడిలానే వుంటుంది. థియేటర్ లో పచ్చడి పచ్చడి చేస్తా. ఫస్ట్ హాఫ్ అంతా డ్యాన్స్ లు ఫైట్లు ఎంటర్ టైన్ మెంట్ అన్నీ బావుంటాయి. ఇంటర్ వెల్ లో కిందా మీద ప్యాక్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఛాతిలో చిన్న బరువు స్టార్ట్ అవుతుంది మెల్లగా చెమటలు వస్తాయి. హార్ట్ బీట్ వెనక ముందు అయితది. ఇవన్నీ మీకు జరుగుతాయి. ఇది ట్రైలర్ 2.0 మాత్రమే కాదు.. ఇది విశ్వక్ సేన్ 2.0. 17న జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తున్నారు. ఆస్కార్ ఈవెంట్ నుంచి నేరుగా మా ఈవెంట్ కి వస్తున్నారు. తారక్ అన్న అందరినీ కాలర్ ఎత్తుకునేలా చేశారు. చాలా గర్వంగా వుంది. ఉగాది 22 బుధవారం సినిమా విడుదలౌతుంది. డౌట్ వున్న వాడు ఎవడూ సినిమాని బుధవారం విడుదల చేయడు. నేను పూర్తి నమ్మకంతో దమ్ముతో చెబుతున్నా. వస్తున్నా కొడుతున్న.. ఇది విశ్వక్ సేన్ 2.0. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో వేడుకలు జరుగుకున్న ప్రతి సినిమా ఘన విజయం సాధించింది. దాస్ కా ధమ్కీ కూడా పెద్ద విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. విశ్వక్ సేన్ తో పాటు చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ లో నాకు కింగ్ కనిపిస్తాడు. తన రాజ్యాన్ని తానే నిర్మించుకునే కింగ్. సోలో గా ఎదిగిన స్టార్ విశ్వక్ సేన్. దాస్ కా ధమ్కీ 22న ఉగాది స్పెషల్ గా థియేటర్ లోకి వస్తుంది. ఉగాది పచ్చడి లానే అన్ని రుచులు ఇందులో వుంటాయి. దాస్ మీకు మీకు అన్ని రుచులు వడ్డిస్తాడు. నిర్మాత రాజు ఎక్కడా రాజీ పడకుండా భారీగా నిర్మించారు. సినిమాలో పని చేసిన అందరికీ బెస్ట్ విశేష్ ‘’ తెలిపారు
నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో ఇంత మాస్ క్రౌడ్ ని చూడటం చాలా ఆనందంగా వుంది. దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ 2.0 ఇక్కడ విడుదల చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. 22న సినిమా విడదలౌతుంది. మీరంతా తప్పకుండా చూడాలి. టీం అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు
ఎమెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ అంటే ఒక వెలుగు మెరుపు. ఆయన సినిమాల్లో ఒక ఎనర్జీ వుంటుంది. కొడుకు ప్రతిభని గుర్తించి 50 కోట్ల రూపాయిలు పెట్టి ఈ సినిమాని తీసిన నిర్మాత కి ధన్యవాదాలు. దాస్ కా ధమ్కీ అందరూ థియేటర్ లో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అల్ ది బెస్ట్’’ చెప్పారు.
కరాటే రాజు మాట్లాడుతూ.. వన్మయే క్రియేషన్స్ పై మేము నిర్మించిన మొదటి సినిమా ఫలక్ నామా దాస్ తో నిర్మాత దర్శకుడు హీరో మిమ్మల్ని అలరించి ఒక స్టార్ డమ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాస్ కా ధమ్మి తో వస్తున్నాం. ఈ సినిమా కోసం పదిహేను నెలల పాటు కష్టపడి పని చేశాం. ఒక అద్భుతమైన సినిమా పాన్ ఇండియా గా తీసుకొస్తున్నాం. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు వున్నాయి. 22న సినిమా చూసిన తర్వాత ఈ సినిమా కోసం మేము ఎంతకష్టపడ్డామో ప్రేక్షకులకే తెలుస్తుంది’’ అన్నారు.
మహేష్ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ ఎనర్జీ మడత పెట్టేస్తాడు. సబ్జెక్ట్ లో వంద వుంటే దాన్ని రెండు వందలు చేసే ప్రతిభావంతుడు. ఆయన నా మనసుకు చాలా దగ్గరగా వుండే వ్యక్తి. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు
లియోన్ జేమ్స్ మాట్లాడుతూ.. ధమ్కి సినిమా కోసం చాలాఎంజాయ్ చేస్తూ పని చేశాం. ఇది సూపర్ అవుట్ అండ్ అవుట్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ఫన్ యాక్షన్ థ్రిల్లర్. 22న అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి’ అని కోరారు
వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ప్రముఖ తారాగణం.
ఇవి కూడా చదవండి…
ఆస్కార్ 2023..విజేతలు వీళ్లే !
ఇప్పటివరకు ఆస్కార్ గెలుచుకున్న ఇండియన్స్..
వీరిద్దరూ ఐదో భారతీయులు..