కృతిసనన్ కి ఘాటు మెసేజ్ లు

62
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ”హీరోయిన్ అంటేనే ఏదో తప్పుమనిషి అన్నట్లు చూస్తుంటారు. అందుకే హీరోయిన్స్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అందువల్లనే ఇండస్ట్రీలో హీరోయిన్స్ పెళ్లిళ్లు లేటుగా జరుగుతాయి” అని చెప్పుకొచ్చింది. కాగా, ప్రభాస్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం కొనసాగిస్తుందని ప్రచారం సాగుతున్న వేళ కృతిసనన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇంకా కృతిసనన్ మాట్లాడుతూ..’అందరికీ తెలుసు. సినిమా పరిశ్రమలో ఒక హీరోయిన్ కి ఎలాంటి కష్టాలు ఉంటాయో. వాటిలో నిజాలు ఉన్నాయి. అయితే, ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు, అన్నీ చోట్లా సమస్యలు ఉన్నాయి. వాటిని దైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే సరైన నిర్ణయాలు తీసుకోవాలి’ అంటూ కృతిసనన్ చెప్పుకొచ్చింది. మొత్తానికి హీరోయిన్స్‌ను అందుకే పెళ్లి చేసుకోరు అంటూ కృతిసనన్ బోల్డ్ గా మాట్లాడింది. అయితే మీరు ఏమి ఫీల్ కావొద్దు, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అంటూ కొందరు నెటిజన్లు ఘాటు మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

ప్రకృతి ఒడిలో సేద తీరిన ముద్దుగుమ్మలు

#NBK108… శ్రీలీల ఎంట్రీ

చరణ్ కోసం శంకర్ స్పెషల్ ప్లాన్

- Advertisement -