త్వరలో నానో డీఏపీ..కేంద్రం..!

24
- Advertisement -

ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా భారత ప్రభుత్వం, ఇఫ్కో..రైతులకు ప్రధాన ప్రోత్సాహకంగా నానో డి-అమోనియా ఫాస్ఫేట్‌ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆమోదించింది. దీన్ని కేంద్ర ఎరువుల నియంత్రణ ఆర్డర్‌ ద్వారా తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిమన్సుఖ్‌ మాండవియా ట్వీట్టర్‌ ద్వారా తెలిపారు.

ఇఫ్కో ఉత్పత్తి అయిన నానో డీఏపీని పారదీప్, కాలోల్‌, కాండ్లలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఇఫ్కో ఎండీ డాక్టర్ యూఎస్‌ అవస్తి తెలిపారు. ఈ యేడాది జూలై నుండి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఒక నానో డీఏపీని 500mlబాటిల్‌కు రూ.600చోప్పున విడుదల చేస్తామని తెలిపారు. ఇది ఒక బాటిల్-ఒక డీఏపీ బ్యాగ్‌కు సమానమని కూడా వెల్లడించారు. అయితే ప్రస్తుతం డీఏపీ బ్యాగు ధర రూ.1350 ఉంది.

సంప్రదాయ యూరియా కంటే నానో యూరియాను సరసమైన ధరకు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 35మిలియన్‌ టన్నుల డిమాండ్ కాగా ఉత్పత్తి 26మిలియన్‌ టన్నులు మాత్రమే ఉందని తెలిపారు. అయితే దేశంలో దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి భారీ పరిమాణంలో డీఏపీ మరియు ఎమ్‌వోపీ(మ్యూరియేట్ ఆఫ్ పొటాష్)లను కూడా దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

వారికి మాత్రమే ఓపీఎస్..కేంద్రం ప్రకటన

నోబెల్ గ్రహీత..బియాలియాట్‌ జైలుశిక్ష.!

టీఎస్‌పీఎస్సీ..ఆమూడు పరీక్షల తేదీలు ప్రకటన

- Advertisement -