- Advertisement -
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాచిగూడ ప్రాంతంలోని గోల్నాక పరిధిలో ఉన్న అనాధాశ్రమంలో మొక్కలు నాటారు. దాదాపు 500మంది అనాధ పిల్లలు ఉన్న అంజుమన్ ఖాదిమిన్ ముస్లిమిన్ సంస్థ ప్రాంతంలో మొక్కలు నాటి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ…మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పార్లమెంటు సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు తాను జన్మదినోత్సవ సందర్భంగా మొక్కలు నాటుతున్నాయని తెలిపారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖాజా బద్రుద్దీన్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
175 విత్ జనసేన.. కమలం క్లారిటీ!
హెకానీ జఖాలు..నాగా చరిత్రలో తొలి మహిళ ఎమ్మెల్యే
అదానీ…కమిటీ వేసిన సుప్రీంకోర్టు!
- Advertisement -