గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా జోరుగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక మహాయజ్ఞం వలే నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తార్నాకలోని వారి నివాసం వద్ద మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి లబ్ధిపొందేలా కృషి చేస్తున్నారని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో గ్రీనరీ శాతం పెరిగిందన్నారు. సందర్భం ఏదైనా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…