మలయాళ సూపర్ హిట్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ ను రీమేక్‌గా హిందీలో రూపొందించిన సినిమా సెల్ఫీ. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రాజ్ మెహతా దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఇందులో ఏం ఉందని అనుకుంటున్నారా..?
ఆగండి… ఆ మధ్య సెల్ఫీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ కుమార్ తన ఫ్లాఫ్ సినిమాల గురించి మాట్లాడుతూ… నేను సినిమాల విషయంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఒక సమయంలో నేను నటించిన 16సినిమాలు కూడా అట్టర్ ఫ్లాఫ్‌గా నిలిచాయి. మరోసారి ఎనిమిది సినిమాలు ఆశించిన మేరకు ఆడలేదు. సినిమా హిట్ అవ్వడంలేదంటే అది నా తప్పే. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదంటే వాళ్లు నా నుంచి కొత్తదనం నిండిన కథలను ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి. నేను ప్రస్తుతం దాని కోసమే ప్రయత్నిస్తున్నాను. ఇది కేవలం ఒక్క సినిమా రంగంలోనే కాదు. ప్రతిరంగంలో ఇది కనిపిస్తుంది. ఒక క్రికెటర్ ప్రతి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించలేడు. నేను చెప్పేది ఒక్కటే…సినిమా హిట్ట అవ్వకపోతే ప్రేక్షకులను నిందించవద్దు. అది వంద శాతం నా తప్పే అని అక్షయ్ కుమార్ అన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అక్షయ్ నెక్స్ట్ సినిమాతో హిట్ అందుకుంటారా…లేదా అని వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి…