దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనేనని అన్నారు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో మాట్లాడిన చంద్రశేఖర్… స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దేశంలో తాగు, సాగు నీటి సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు.
విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని పేర్కొన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఇప్పటికీ మెట్రో రైలు సౌకర్యం లేదని అన్నారు. దక్షిణాదిపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు.
తెలంగాణ తరహాలో అన్ని రాష్ట్రాల్లోనూ అభివృద్ధి జరగాలని ఆకాంక్షించిన చంద్రశేఖర్…బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన పార్టీ రావాల్సిన అవరసం ఉందన్నారు. దేశంలో స్వశక్తితో బీఆర్‌ఎస్ బలమైన పార్టీగా రాబోయే ఎన్నికల్లో చూస్తారని అన్నారు.
ఇవి కూడా చదవండి..