భోళా శంకర్‌లో రీమేక్ సాంగ్‌…

70
- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో రీమిక్స్‌ హవా కొనసాగుతుంది. వాల్తేర్‌ వీరయ్య సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్న మెగా స్టార్ రీమిక్స్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారని టాలీవుడ్‌లో టాక్‌. భోళా శంకర్‌తో మరోసారి మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి. మెహర్ రమేశ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ చిరంజీవి చెల్లెలిగా కనువిందు చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

చిరంజీవి మణిశర్మ కాంబినేషనల్ వచ్చిన చూడాలని ఉంది సినిమాలోని ఓ సాంగ్‌ను రీమేక్ చేయనున్నట్టు టాక్. అయితే అప్పట్లో మణిశర్మ స్వరాలు సమకూర్చగా ఇప్పుడు మహతి స్వరసాగర్ బాణీలు సమకూరుస్తుండటం విశేషం. ఇంతకి ఏ పాటు అనుకుంటున్నారా రామా చిలుకమ్మా సాంగ్‌ను రీమేక్ చేస్తున్నారట.

కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న భోళా శంకర్ సినిమాలో ఈ పాటను వాడనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా క్లారిటీ ఇవాల్సి ఉంది. అన్నట్టు చూడాలని ఉంది సినిమా కూడా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా అని మనందరికీ తెలుసు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్‌ సంయుక్తగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, అర్జున్‌దాస్, రష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

బాలయ్య కొత్త షెడ్యూల్ ఖరారు

ఓ తండ్రిగా గర్వపడుతున్నా..

మార్చిలో వస్తున్న “వీరఖడ్గం”

- Advertisement -