ఫామ్‌లోకి వచ్చాడులే అనుకునే టైమ్‌కు నాగ చైతన్య థాంక్యూ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. చైతూ ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు. ‘కస్టడీ’ చిత్రం ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇందులో చైతు ఓ కానిస్టేబుల్ గా కనపడనున్నారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మూవీ కోసం ఏకంగా ఏడు భారీ సెట్స్ వేశారట. కేవలం ఒక పాట కోసమే ఈ సెట్లని వేసినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుంది. ఐతే, 7 సెట్‌లు వేసి భారీగా ఓ పాటను చిత్రీకరిస్తుండటం పై విమర్శలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్నాడు. పైగా చైతుకి భారీ మార్కెట్ కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో చైతు సాంగ్ కోసం ఎందుకు ఇంత భారీగా ఖర్చు పెడుతున్నారు ? అంటూ టాక్ నడుస్తోంది.
ఐతే, ఈ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు మంచి దర్శకుడే కాదు వెర్సటైల్ రైటర్ కూడా. యూత్ ఫుల్ కంటెంట్ కు కాంటెంపరరీ స్టఫ్ తో పాటు ఎమోషనల్ సోషల్ కాజ్ ను కూడా అద్దగలడు వెంకట్ ప్రభు. అందుకే ఇప్పుడు వెంకట్ ప్రభు – చైతు కలయికలో వస్తోన్న కస్టడీ పై భారీ అంచనాలు ఉన్నాయి. కృతి శెట్టి ఈ సినిమాలో చైతూకి జోడీగా నటిస్తుంది.
ఇవి కూడా చదవండి..