కొడాలి నాని..ఇకనైనా మేలుకో!

34
- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయినప్పటికి ఇప్పటినుంచే ఎన్నికల వేడిని పెంచుతున్నాయి మూడు ప్రధాన పార్టీలు. ముఖ్యంగా అధికార వైసీపీ వచ్చే ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎన్నికల్లో కేవలం విజయం మాత్రమే కాకుండా 175 స్థానాల్లోనూ విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే అధినేత జగన్ కూడా వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన నేతలను, ఎమ్మెల్యేలను, ఎంపిలను ” గడప గడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమం ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నారు..

కాగా ” గడప గడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమాన్ని జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికి కొందరి నేతలు మాత్రం ఈ కార్యక్రమం పట్ల అంటి అంటనట్టుగానే వ్యహహరిస్తుండడంతో 20 మంది ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ ఆ మద్య స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ లిస్ట్ లో మాజీ మంత్రి కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ వంటి వారు కూడా ఉన్నారు. ఇక తాజాగా మరోసారి ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించిన సి‌ఎం జగన్.. ” గడపగడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వద్దని మరోసారి హెచ్చరించారట. ఈ నేపథ్యం కొడాలి నానికి జగన్ ప్రత్యేకంగా క్లాస్ పీకినట్లు సమాచారం.

జగన్ కు అత్యంత ఆత్మీయుడిగా ఉన్న కొడాలి.. ఇంటింటికి తిరగడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఆయనకు ప్రత్యేక సూచనలు చేశారట సి‌ఎం జగన్. నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రతిరోజూ ఆరు గంటలు ప్రజల్లో తిరగాలని ” తనకు జగన్ పర్సనల్ గా సూచించినట్లు కొడాలి చెప్పుకొచ్చారు. మమ్మల్ని గాలికి వదిలేస్తే అందరం మునిగిపోతాం.. సి‌ఎం ఇలా చేయడమే కరెక్ట్ ” అంటూ కొడాలి తనదైన రీతిలో చెప్పుకోచ్చారు. కాగా కొడాలి నాని విషయంలో మొదటి నుంచి కూడా ఆయన భాష విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురవుతున్న కొడాలి భాష విధానంలో ఎలాంటి మార్పు కనబడడంలేదు. మరి రాబోయే రోజుల్లో నాని తన వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పై ప్రభావం పడుతుందని రాజకీయ వాదుల అభిప్రాయం. మరి కొడాలి నాని ఇకనైనా మేలుకుంటాడో లేదో చూద్దాం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -