ప్చ్.. పెళ్లికి ముందే తల్లైందా?

44
- Advertisement -

బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్(కేఆర్‌కే) తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. ఫస్ట్‌ ప్రెగ్నెంట్‌ అయ్యాక.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదే కొత్త ట్రెండ్. ఇటీవల జరిగిన పెళ్లిలోనూ ఇదే ఫార్ములా నడిచినట్టు తెలుస్తోంది. మంచిది’ అని ట్వీట్ చేశారు. అయితే ఆ కొత్త కపుల్ కియారా, సిద్దార్థేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ప్రతి ఒక్కరిపై కామెంట్స్ చేయడం అవసరమా ?’ అంటూ నెటిజన్లు కొందరు కేఆర్‌కేపై ఫైర్ అవుతున్నారు. మొత్తానికి కియారా పెళ్లికి ముందే తల్లైందా ? అంటూ మీడియా అనేక కథనాలను కూడా ప్రసారం చేస్తోంది.

ఇప్పటివరకూ అయితే, అటు కియారా అద్వానీ గానీ, ఇటు హిందీ హీరో సిద్దార్థ్ మల్హోత్రా గానీ ఈ అంశం పై ఎలాంటి కామెంట్ చేయలేదు. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ కూడా పెళ్లికి ముందే తల్లి అయింది. అలియా రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన 8 నెలలకే ఆడ పిల్లకు జన్మనిచ్చింది అలియా. ఈ విషయం పై క్లారిటీ కూడా ఇచ్చింది అలియా. ‘అవును, నేను పెళ్లికి ముందే గర్భం దాల్చడం చాలా మందికి నచ్చలేదు. నిజానికి ఇది ప్లాన్ చేసింది కాదు. ఎప్పటి నుంచో రణబీర్ – నేను చాలా దగ్గరగా ఉంటున్నాం. ఈ క్రమంలోనే వివాహానికి ముందే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది అని అలియా చెప్పుకొచ్చింది.

ఇప్పుడు కియారా అద్వానీ పరిస్థితి కూడా అదే అని టాక్ నడుస్తోంది. దీంతో కియారా అద్వానీ పెళ్లికి ముందే గర్భవతి అంటూ సోషల్ మీడియాలో ఆమె పై నెగిటివ్ కామెంట్లు విపరీతంగా వస్తున్నాయి. మరోపక్క కియారా – సిద్ధార్థ్‌లకు స్పెషల్ విషెస్ చెబుతున్నారు సినీ ప్రముఖులు. ఒకవేళ కియారా అద్వానీ గర్భవతి అయితే.. మరి ఆమె చేస్తున్న సినిమాల పరిస్థితి ఏమిటి అనేది డౌటే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -