హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాపై మరోసారి ప్రశంసలు కురిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా జేమ్స్ కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ.. ” ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌తో పాటు ప్రతి పాత్రను రాజమౌళి అద్భుతంగా చూపించాడు. కథ చెప్పడంలో రాజమౌళి, షేక్ స్పియర్స్‌ను తలపించాడు” అని ఈ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కామెంట్స్ చేయడం విశేషం.
అలాగే జేమ్స్ కామెరూన్ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించడం మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ని ఇచ్చింది. ఇంతకీ ఈ ‘అవతార్’ డైరెక్టర్ చరణ్ గురించి ఏం మాట్లాడాడు అంటే.. ‘చరణ్ పోషించిన రామ్ పాత్ర అద్భుతం. రామ్ గా చరణ్ నటన మరో స్థాయిలో ఉంది. రాజమౌళితో వీటన్నిటి గురించి నేను చాలా వివరంగా మాట్లాడాలని అనుకుంటున్నాను’ అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జేమ్స్ కామెరూన్ కామెంట్స్ చేశారు.
జేమ్స్ కామెరూన్ చరణ్ పాత్ర గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘రామ్ పాత్ర చాలా ఛాలెంజింగ్ రోల్, ఆ పాత్ర రియలైజ్ అయ్యినపుడు హార్ట్ బ్రేకింగ్ గా అనిపించింది. రాజమౌళి తో మొన్న ఎక్కువ సేపు ఈ రోల్ గురించి మాట్లాడటం కుదరలేదు. నాకు చరణ్ పాత్ర బాగా నచ్చింది అంటూ జేమ్స్ చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి..