దేశాభివృద్ధిలో బలమైన స్తంభంగా ఢిల్లీముంబై నిలవనుందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఢిల్లీ దౌసా లాల్‌సోట్‌ల మధ్య పూర్తియిన తొలిదశ రహదారిని మోదీ ప్రారంభించారు. రాజస్థాన్‌లోని దౌసాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.
మొత్తం రూ. 18,100కోట్లతో చేపడుతున్న నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తొలిదశలో 247 కిలోమీటర్ల మేర రహదారిని ఎనిమిది లేన్లుగా రూ.10,400 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీంతో ఇక మీదట మూడన్నర గంటల్లోనే ఢిల్లీ నుంచి జైపూర్ కు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ 5గంటల సమయం పడుతుంది. ఈ ప్రాజెక్ట్ 2019 మార్చి9న కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది.
ఢిల్లీ నుంచి ముంబై వరకు ఉన్న 1386కిలోమీటర్ల దూరంను హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహరాష్ట్రల మీదుగా వెళ్లనుంది. ఈ రహదారి జైపూర్, అజ్‌మేర్, కోటా, ఉదయ్‌పూర్, చిత్తోర్‌ఘఢ్, భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, అహ్మదాబాద్, సూరత్, వడోదరా లాంటి ప్రధాన పట్టణాల గుండా పయనిస్తుంది. దీంతో రెండు ప్రధాన నగరాల మధ్య దూరం 180కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతో ప్రయాణ సమయం 24గంటల నుంచి 12గంటలకు తగ్గిపోనుంది. ఈయేడాది చివరికల్లా ఈ ఎక్స్‌ప్రెస్‌వేను పూర్తిగా అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇవి కూడా చదవండి…