- Advertisement -
త్వరలోనే పోడు భూముల సమస్యను పరిస్కరిస్తాం అని తెలిపారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేసిన సీఎం…త్వరలోనే గిరిజనులకు గిరజన బంధు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీప్రాంత రక్షణ కోసం సాయుధ బలగాలను నియమిస్తామని చెప్పారు.
ఈ నెలాఖరులోగా పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో లెక్కలు తీశామని రాష్ట్రంలో 11.50 లక్షల ఎకరాల పోడు భూములున్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ లెక్క ఇంతకే పరిమితం కావాలని, మళ్లీ అడవులను నరుకుతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. పట్టాలుపొందాలంటే గ్రామాల వారీగా తీర్మానాలు చేయాలన్నారు.
ఈ తీర్మానంలో అఖిలపక్ష నాయకులు, గిరిజన పెద్దలు, సర్పంచ్, ఎంపీటీసీ సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. అలా తీర్మానం చేయని గ్రామాల్లో పట్టాల పంపిణీ ఉండబోదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -