- Advertisement -
ఎస్పీ బాలసుబ్రమణ్యం పోగానే తెలుగుపాట చీకటైపోయిందన్నారు గానకోకిల సుశీల. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుశీల..ఎస్పీబీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలు కలిసి ఒక రికార్డింగ్ థియేటర్ నుంచి మరో రికార్డింగ్ థియేటర్ కు పరుగులు పెడుతూ ఉండేవాళ్లం. మహాత్ముడు బాలు ఎక్కడ ఉన్నాడోగానీ ఆయన పోయిన తరువాత తెలుగు పాట చీకటైపోయిందన్నారు.
ఇంతవరకూ ఎన్నో వేల పాటలు పాడాను. పాడటం ఎప్పుడూ అలసటగా అనిపించేది కాదన్నారు. ఘంటసాల మా ఊళ్లోనే చదువుకున్నారు. కానీ నేను ఆయనను అక్కడ చూడలేదు. మద్రాసు వచ్చిన తరువాతనే ఏవీఎమ్ స్టూడియోలో చూశానని తెలిపారు. నా కెరీర్‌లో ‘లవ కుశ’ ,’భక్త ప్రహ్లాద’ ఈ రెండు సినిమాలు గుర్తుండిపోయేవన్నారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -