రాహుల్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చిన జీవీకే…

24
- Advertisement -

అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం తమ కంపెనీపై ఒత్తిడి తెచ్చిందని చేసిన వాదనలను జీవీకే గ్రూప్ వైస్ ఛైర్మన్‌ జీవీ సంజయ్‌రెడ్డి తోసిపుచ్చారు. మంగళవారం పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వాదనలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ జాతీయ ఛానెల్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా…జీవీకేకి సంబంధించినంతవరకు విమానాశ్రయాన్ని విక్రయించమని గౌతమ్ అదానీ లేదా మరే ఇతర ఏజెన్సీ ద్వారా మా పై ఎటువంటి ఒత్తిడి లేదు. ఇది కేవలం మా స్వంత వాణిజ్య ఆసక్తితో మాత్రమే ఒప్పందం జరిగిందన్నారు.

జీవీకే సంస్థ అధ్వర్యంలో నడిచే ముంబాయి విమానాశ్రయం ఒక హోల్డింగ్ కంపెనీ అని ఆయన అన్నారు. జీవీకే సంస్థ 10 సంవత్సరాల క్రితం బెంగళూరు విమానాశ్రయాన్ని కొనుగోలు చేసినప్పుడు హోల్డింగ్ కంపెనీలో కొన్ని రుణాలు సేకరించామని… ఆ రుణాలు బకాయిగా మారాయని అందుకోసమే ముంబాయి విమానాశ్రయాన్ని అదానీకి అప్పగించామని అన్నారు. దురదృష్టవశాత్తు 2020లో, కోవిడ్ మహమ్మారి ఉందని, దాదాపు 3-4 నెలల పాటు విమానాశ్రయం పూర్తిగా మూసివేయబడిందని రెడ్డి చెప్పారు.

పెట్టుబడిదారుల నుండి డబ్బు కోసం మరింత జాప్యం జరగడం వల్ల…అదే సమయంలో అప్పుల భారం కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో, గౌతమ్ అదానీ నన్ను సంప్రదించి, ముంబై విమానాశ్రయంపై తనకు చాలా ఆసక్తి ఉందని, ఎలాంటి షరతులు లేకుండా వెంటనే లావాదేవీని పూర్తి చేయాలనే షరతుతో విదేశీ పెట్టుబడిదారులు మాకు అందించిన నిబంధనలనే మాకు అందించాలనుకుంటున్నారని చెప్పారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌ను అదానీ హోల్డింగ్స్‌కు అప్పగించడం బాధాకరమైన అమ్మకం కాదని రెడ్డి ఉద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి…

అమిత్‌ షాకు కోటంరెడ్డి ఫిర్యాదు..

నాడు-నేడు…పాఠశాల సీలింగ్ కూలింది

షాకిచ్చిన ఆర్బీఐ…

- Advertisement -