అందం, అభినయంలో ఎలాంటి లోటూ లేకున్నా.. ఎందుకో కుర్ర హీరోయిన్ శ్రీలీల కు చెప్పుకోతగ్గ అవకాశాలు రావడం లేదు. పైగా శ్రీలీల గ్లామర్‌ని కమర్షియల్ పాయింట్లో టచ్ చేస్తున్నారే తప్ప, శ్రీలీల లోని పెర్ఫార్మెన్స్ కోణాన్ని పూర్తిగా చూపించే పాత్రలను ఆమెకు ఇవ్వడం లేదు. నిజానికి శ్రీలీల హీరోయిన్ కాకముందే స్టేజి ఆర్టిస్ట్. అన్నిటికీ మించి చిన్నప్పటి నుంచే శ్రీలీల నటి కావాలని కోరుకుంది. అందుకు తగ్గట్టు తనను తానూ మార్చుకుంది.
ధమాకా లో సీనియర్ హీరో రవితేజ తో రొమాన్స్ చేయడంతో.. ఇప్పుడు శ్రీలీల కు కుర్ర హీరోల సరసన పాత్రలు లేకుండా పోయాయి. అసలు ప్రస్తుతం శ్రీలీల వయసు 21 సంవత్సరాలు. ఇప్పుడున్న అందరి కుర్ర హీరోలకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. కానీ, సీనియర్ల పక్కన తప్పితే కుర్రాళ్ళు ఆమెను పట్టించుకోవడం లేదు. అందుకే, శ్రీలీల కూడా సైడ్ పాత్రలు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాలో కూతురు పాత్రకు ఓకే చెప్పింది.
అలాగే మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమాలో కూడా మహేష్ కి సిస్టర్ గా కనిపించబోతుంది. మహేష్ సరసన హీరోయిన్ గా చేయాల్సిన అమ్మడు, సిస్టర్ గా నటించడం ఏమిటి ?. శ్రీలీల హీరోయిన్ గా హిట్టనిపించుకున్నా – ఎందుకో ఆమె కెరీర్ కు బ్యాడ్‌గానే మారింది. దీనికితోడు ఆమె సినిమాల ఎంపిక కూడా.. స్టేటస్వున్న హీరోయిన్గా ఆమెకు గుర్తింపు లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలీల కు మళ్లీ మరో సీనియర్ హీరో ఉపేంద్ర సరసనే చాన్స్ వచ్చిందట. చివరకు ఆమె కెరీర్ ఎటు పోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి…