దసరా…వాలైంటైన్స్ డే గిఫ్ట్

39
- Advertisement -

సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో తెరకెక్కుతున్న నాని సినిమా దసరా..తాజాగా మరో కొత్త అప్‌డేట్ ఇచ్చేసింది. అయితే నాని గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్టు అందుకోలేకపోయాడు. కానీ ఈ సినిమా ద్వారా కంబ్యాక్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్‌ కీలకపాత్రలో నటించనుంది.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా వాలైంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఓ లవ్‌ట్రాక్‌ను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్‌లో టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇంతకు ముందు ధూమ్ ధామ్ దోస్తాన్ పాటను ఇప్పటికే విడుదల చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దసరా సినిమాకు అన్ని హక్కులకు కలిపి రూ.80కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు టాలీవుడ్‌లో టాక్‌. అన్నట్టు ఈ సినిమాలో నాని ఊరమాస్‌ లుక్‌లో కనువిందు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి…

అతనితో ఎలా కమల్ ?

కియారా పెళ్లి., ఉపాసన సారీ !

బాలయ్య కోసం కాజల్ కి 2 కోట్లు

- Advertisement -