నేను నటుడిని…నన్ను అలా పిలవొద్దు

41
- Advertisement -

చిన్న సినిమా  నుంచి వచ్చి తన విలక్షణమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌ సేతుపతి. ప్రస్తుతం విజయ్‌ తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విలేకరులపై అసహనంను ప్రదర్శించారు. తాను పాన్ ఇండియా స్థాయి నటున్ని కాదని అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…నన్ను పాన్ ఇండియా నటుడిని పిలవొద్దు. నేను కేవలం నటుడిని మాత్రమే…పాన్ ఇండియా స్టేట్‌మెంట్‌తో కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పకొచ్చారు. కొన్ని సార్లు ఆమాట వింటే నాకు విపరీతంగా ఒత్తడి పెరుగుతుందన్నారు. మరోసారి చెబుతున్నా..నేను కేవలం నటుడిని మాత్రమేనని దానికి ఎటువంటి లేబుల్‌ అతికించవద్దని కోరారు. అన్ని భాషల్లో నటించాలని ఉందని..ఎక్కడ అవకాశాం వచ్చినా నటిస్తా అని విజయ్‌ సేతుపతి అన్నారు.

తెలుగు ప్రేక్షకులకు ఫిజ్జా, 96, సుందర్‌పాండియన్ సినిమాలతో పరిచయమయ్యారు. అయితే ఉప్పెన సినిమాతో మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం విజయ్‌ తెలుగులో మైఖేల్ సినిమాలో నటించారు. దీంతో పాటుగా హిందీలో మేరీ క్రిస్మస్ ద్వారా కత్రినా కైఫ్‌తో నటిస్తున్నారు. అన్నట్టు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ తో జవాన్ సినిమాలో నటించనున్నారు.

ఇవి కూడా చదవండి…

దసరా…వాలైంటైన్స్ డే గిఫ్ట్

అతనితో ఎలా కమల్ ?

కియారా పెళ్లి., ఉపాసన సారీ !

- Advertisement -