పట్నంకు వచ్చిన డబుల్ డెక్కర్‌ బస్సులు..

59
- Advertisement -

ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపింది.  ఆర్టీసీ కొత్తగా 300ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా నగరవాసులకు డబుల్‌ డెక్కర్ బస్సులు హైదరాబాద్‌కు చేరుకున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. గతంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌కు డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్‌కు వచ్చాయని …త్వరలోనే ఈ బస్సులు నగర రహదారులపై పరుగులు పెట్టనున్నట్టు చెప్పుకొచ్చారు.

డబుల్‌ డెక్కర్ బస్సులో కింది భాగంలో సీటింగ్ సౌకర్యం ఉండగా… పైన కూడా అదనంగా సీటింగ్ ఉంది. ఈ బస్సులు పెద్ద పెద్ద అద్దాలతో ఎంతో అందంగా ఉన్నాయి. ఇలాంటి బస్సుల డిజైన్‌లు ఎక్కువగా అమెరికా లాంటి దేశాల్లో ఉండే బస్సులను పోలి ఉంది. ఇందులో కొన్ని బస్సులకు ఓపెన్ టాప్ కూడా ఉంది. దీన్ని ద్వారా నగరంలోని ప్రముఖ ప్రాంతాల చూసే విధంగా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల మధ్య పరుగులు తీయనున్నట్టు తెలిపారు. ఇందులో ప్రయాణించేటప్పుడు హైదరాబాద్ అందాలను విక్షించే విధంగా రూపొందించారు. అయితే ఏ ఏ రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణిస్తున్నాయన్న వివరాలు ప్రదర్శించే విధంగా పెద్ద పెద్ద డిస్‌ప్లే కూడా ఉంది. దీంతో 1990వ దశకంలో పుట్టినవారు డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ యాది చేసుకొనున్నారు. మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనుంది.

ఇవి కూడా చదవండి…

కాలుష్య నివారణే మా లక్ష్యం:కేటీఆర్

ఉపాధ్యాయుల బదిలీలకు కీలక నిర్ణయం..

రేవంత్ పాదయాత్ర.. కాంగ్రెస్ ను గట్టెక్కిస్తుందా?

- Advertisement -