దేశంలో సంచలనం సృష్టించిన అదానీ హిండెన్బర్గ్ విషయంపై పార్లమెంట్‌లో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. దేశంలో సంక్షోభిత పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. అదానీ సంస్థల షేర్ల విలువలు పడిపోతున్నా కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం దారుణమని విమర్శించారు.
అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అదానీ వ్యవహారంపై ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోదీ మద్ధతుతో అదానీ అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచమంతా తెలుసునని అన్నారు. అదానీ వ్యవహారంపై ఎవ్వరు ప్రశ్నించినా అంతా బాగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రిజర్వు బ్యాంకు చెబుతున్నారని చెప్పారు.
కేంద్రంలోని మోదీ బడ్జెట్ దేశాన్ని నిరుత్సాహపర్చితే కేసీఆర్ తెలంగాణ బడ్జెట్ మాత్రం దేశానికి స్పూర్తినిస్తుందన్నారు. రూ. 2.9 లక్షల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమన్నారు. దేశానికి స్పూర్తిగా నిలిచే అంశాలు ఈ బడ్జెట్‌లో ఎన్నో ఉన్నాయని వివరించారు. దామాషా ప్రకారం తెలంగాణలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయని సామాజిక రంగంలో ఆయా వర్గాల జనాభాకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయని స్పష్టం చేశారు. దేశంలో లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి కోత విధించిందని, తక్షణమే ఆ పథకానికి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థలకు ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్‌కు కవిత కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి…