జగన్ కు విశాఖా స్ట్రోక్.. తగలనుందా?

61
- Advertisement -

దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు రాజధానులు ప్రవేశ పెడతామని.. జగన్ ప్రభుత్వం మంకిపట్టు పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగాను, కర్నూల్ ను న్యాయ రాజధానిగాను, అమరావతిని శాసన రాజధానిగాను ప్రకటించి అన్నీ ప్రాంతాలను అభివృద్ది చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే మూడు ప్రాంతాలను అభివృద్ది చేయడం అనేది మంచి విషయమే అయినప్పటికి.. అందుకోసం రాజధానిని మూడు ముక్కలు చేయాలా ? అనే ప్రశ్నలు కూడా తరచూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. దాంతో అమరావతి ప్రాంత రైతులు వందల ఎకరాల భూమిని రాజధానికోసం వదులుకోవాల్సి వచ్చింది. తీర ప్రభుత్వం మారిన తరువాత మళ్ళీ రాజధాని మార్పు తెరపైకి రావడంతో రాజధానికోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

మరోవైపు జగన్ ప్రభుత్వమేమో ఎట్టి పరిస్థితీల్లోనూ మూడు రాజధానులను అమలు చేసితీరుతామని పట్టు బట్టిన నేపథ్యంలో అమరావతి రైతులు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు జగన్ సర్కారుకు షాక్ ఇస్తూ మూడు రాజధానుల జీవోపై స్టే విధించింది. ఇదిలా ఉండగా ఇటీవల డిల్లీలో జరిగిన గ్లోబెల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సి‌ఎం జగన్ మాట్లాడుతూ.. త్వరలో విశాఖపట్నం రాజధాని కాబోతుందని, తాము కూడా అక్కడికే షిఫ్ట్ అవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో రాజధాని రచ్చ మళ్ళీ మొదలైంది.. ఓవైపు కోర్టులో స్టే ఉన్నప్పటికి సి‌ఎం జగన్ ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటని అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి. దీంతో సి‌ఎం జగన్ కోర్టు దిక్కరణ చర్యకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది లక్ష్మి నారాయణ సుప్రీం కోర్టు జస్టిస్ కు ఇటీవల లేఖ కూడా రాశారు.

అయితే వైసీపీ నేతలు మాత్రం తమ నాయకుడు విశాఖ ఒక్కటే రాజధాని అని చెప్పలేదని.. కోర్టు అడ్డంకులు తొలగిన తరువాతే మూడు రాజధానులపై ముందుకు వెళతామని చెబుతున్నారు. కాగా ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండడంతో ఈ లోపల మూడు రాజధానులను అమలు సాధ్యమౌతుందో లేదో అనే డౌట్ తోనే ఎలాంటి రాజధాని ప్రకటన లేకుండా విశాఖా నుంచి పలిపాలన మొదలు పెట్టాలని జగన్ ఆలోచనగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ కోర్టు దిక్కరణ కు పాల్పడి జగన్ విశాఖాను మాత్రమే రాజధానిగా ప్రకటిస్తే.. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 129,1950. మరియు ఆర్టికల్ 142 ప్రకారం వైఎస్ జగన్ శిక్ష ఎదుర్కొక తప్పదు. మొత్తానికీ రాజధాని ప్రకటనతో వైఎస్ జగన్ కు విశాఖా స్ట్రోక్ తగలనుందా ? అనే సందేహాలు వస్తున్నాయి. మరి చూడాలి జగన్ సర్కార్ ఈ విషయంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళుతుందో మరి.

ఇవి కూడా చదవండి…

అసెంబ్లీ రద్దా.. నో ఛాన్స్!

దేశమంతా సుపరిపాలనే.. కే‌సీఆర్ లక్ష్యం!

ఎవరితో లాలూచీపడను: జగ్గారెడ్డి

- Advertisement -