మహారాష్ట్రలోని నాందేడ్ సభలో ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై ప్రశంసలు గుప్పించారు సీఎం కేసీఆర్. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన సుమన్.. ప్రజల కోసం పని చేస్తున్నాడని కొనియాడారు. నాయకులు మన మధ్యలో నుంచే పుట్టుకొస్తారని, అందుకు బాల్క సుమన్ నిదర్శనం అన్నారు.
కాలేజీలో చదువుకున్నప్పుడు తెలంగాణ యుద్ధంలో నాతో పాటు పాల్గొన్నాడని.. ఆ తర్వాత చిన్న వయసులోనే 31 ఏండ్లకే ఎంపీ అయ్యారని చెప్పారు. ఆత్మవిశ్వాసం, తెగింపు, నమ్మకం ఉంటే తప్పకుండా నాయకులం అవుతాం. నాయకులు ఎక్కడో ఉండరు.. ఇలా మన మధ్యలో నుంచే నాయకులు పుట్టుకొస్తారని తెలిపారు.
రైతులకు తెలంగాణలో ఏ వసతులు లభిస్తున్నాయో.. అలాంటి వసతులు మహారాష్ట్రలో లభించాలంటే గులాబీ జెండాను గెలిపించండని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం మీరే నేతలు కావాలన్నారు. మనలో నుంచే నాయకుడు పుట్టుకొస్తాడని కేసీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..